Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సంచ‌ల‌న వార్నింగ్‌.. ముప్పు త‌ప్ప‌దా?

Share

Corona: ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం స‌ద్దుమ‌ణిగింద‌ని అంతా భావిస్తున్న స‌మ‌యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ పిడుగు లాంటి వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుంద‌ని భావిస్తున్న‌ తరుణంలో… ప్ర‌పంచ‌వ్యాప్తంగా థర్డ్ వేవ్ తొలి దశ‌లో ఉన్న‌ట్లు ఆయన హెచ్చ‌రించారు. దీంతో ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లైంది.

Read More: Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎంత డేంజ‌ర‌స్ అనేది మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు!


ఆయ‌న ఏమంటున్నారంటే…
జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ, దురదృష్టవశాత్తూ మ‌నమంతా ప్రస్తుతం కోవిడ్ మూడవ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామ‌ని అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో సామాజిక చైత‌న్యం పెరిగిన‌ప్ప‌టికీ డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌డం, కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌ను క‌లిగిస్తుంద‌ని టెడ్రోస్ అన్నారు. క‌రోనా వైర‌స్ వేగంగా మారుతుంద‌ని, దీంతో వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని చెప్పారు. డెల్టా వేరియంట్ ఇప్పుడు 111 కి పైగా దేశాలలో ఉంద‌ని, దీన్ని వీలైనంత త్వ‌ర‌గా అంతం చేయాల‌ని, లేదంటే విప‌రీత‌మైన ప‌రిణామాలు ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Read More: Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడో తెలిస్తే షాకే..ఎస్‌బీఐ ఏం చెప్తుందదంటే…

అదే అస‌లు స‌మ‌స్య‌…

ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌రుస‌గా నాలుగో వారం కూడా రోజువారీగా న‌మోద‌వుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంద‌న్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ర‌థ‌సార‌థి ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌న్నారు. వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని, కేవలం సంపన్న దేశాలు ఎక్కువ టీకాలను పొందాయని టెడ్రోస్ తెలిపారు. ఇప్ప‌టికీ ఇంకా అనేక దేశాల‌కు టీకాలు అస‌లు చేర‌లేద‌ని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెబుతోందని ఆయన గుర్తు చేశారు.


Share

Related posts

వ్యవసాయ చట్టాల రద్దుకై రాష్టపతికి అఖిలపక్ష నేతల వినతి

somaraju sharma

లక్ష రూపాయల కోసం స్వంత కిడ్నప్ డ్రామా.. చివరికి?

Teja

Eatela Rajendar: ఈట‌ల కుట్ర చేశారు… సంచ‌ల‌న కామెంట్లు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

sridhar