30.2 C
Hyderabad
March 27, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడు(ట).. తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన

Share

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విషయంపై తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులతో ఆయన టచ్ లో ఉన్నారని కూడా తెలిపారు నెడుమారన్. ప్రభాకరన్ చనిపోయినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తమని అన్నారు. తాను బ్రతికే ఉన్నట్లు ప్రజలకు చెప్పమన్నారనీ, అందుకే మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు.

world tamil federation president Nedumaran says LTTE chief prabhakaran is alive

 

తమిళ జాతీయ నాయకుడు ప్రభాకరన్ గురించి నిజాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు నెడుమారన్. ఆయన బాగానే ఉన్నారనీ, ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వార్తతో ప్రభాకరన్ చనిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందని ఆశిస్తున్నానన్నారు. తమిళ జాతి విముక్తి కోసం ఆయన (ప్రభాకరన్) త్వరలో ఒక ప్రణాళికను ప్రకటించబోతున్నారనీ, ప్రపంచంలోని తమిళ ప్రజలందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని నెడుమారన్ కోరారు.

వాస్తవానికి 2009 లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యం జరిపిన పోరులో ప్రభాకరన్ చనిపోయినట్లుగా ప్రకటించారు. 2009 మే 18న జరిగిన పోరులో ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ అంథోనీ కూడా చనిపోయారు. ప్రభాకరన్ చనిపోయారని, ఆయన మృతదేహాం ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది. అయితే 14 సంవత్సరాల తర్వాత ఆయన (ప్రభాకరన్) జీవించే ఉన్నాడంటూ నెడుమారన్ మీడియా ముఖంగా ప్రకటించడం తీవ్ర సంచలనం రేపింది.

జనసేన పొత్తుల ఎఫెక్ట్ .. ఆ నియోజకవర్గంలో టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

 


Share

Related posts

వెంటనే ఎలా వెళ్ళాలి?

sarath

అమ్మనా మోడీ ఇన్నాళ్లు నీకు జగన్ మీద ఉన్నది కపట ప్రేమా?

sekhar

బాలల్లో స్ఫూర్తికి “కిడ్స్ టేక్ఓవర్” నిర్వహించిన వాసిరెడ్డి పద్మ

Special Bureau