NewsOrbit
జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Yadiyurappa: య‌డియూర‌ప్ప మ‌న‌సున్నోడ‌ప్ప… ప‌ద‌వి దిగుతూ 6 ల‌క్ష‌ల‌మందికి తీపిక‌బురు

Yadiyurappa: పొరుగు రాష్ట్రాల రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న‌వారికి క‌ర్ణాట‌క సీఎం బీఎస్ య‌డియుర‌ప్ప ఉదంతం ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేయడం, కొత్త సీఎం ఎంపికపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించడం తెలిసిన సంగ‌తే. యడ్డి వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డికి అప్పగించారు. అయితే, ఓ వైపు ప‌రిణామాలు ఇలా మారుతుంటే యడియూర‌ప్ప మాత్రం త‌న‌దైన శైలిలో ప‌ద‌వి దిగుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

Read More : BJP: దూసుకువ‌స్తున్న మాయావ‌తి.. యూపీలో బీజేపీకి బీపీ?

య‌డియూర‌ప్ప సంచ‌ల‌న నిర్ణ‌యం…

యడియూరప్ప సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసినప్ప‌టికీ కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు క‌ర్ణాట‌క‌ ఆప‌ద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ కోరారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు చివ‌రి నిమిషంలో య‌డియూర‌ప్ప‌ తీపికబురు చెప్పారు. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో రాష్ట్రంలోని 6 ల‌క్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 ల‌క్షల మంది పెన్షన‌ర్ల‌తో పాటు వివిధ‌ పీఎస్‌యూలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే దాదాపు మూడు ల‌క్షల మంది ఉద్యోగుల‌కు లబ్ధి చేకూర‌నుంది. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూల‌వేత‌నంలో 11.25 శాతంగా ఉంది. తాజా నిర్ణ‌యంతో ఉద్యోగుల మూల‌వేత‌నంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది.

Read More: Modi: ఓ రికార్డు… ఓ నిర‌స‌న‌.. రెండూ మోడీ పెట్రోల్ ధ‌ర‌ల మ‌హిమేన‌ట‌!

హాట్ హాట్ రాజ‌కీయాలు…
ఇదిలాఉండ‌గా, ఇవాళ రాత్రి 7 గంటలకు కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ స‌మావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిని నియమించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్టానం త‌ర‌ఫున వీరు సేకరించనున్నారు. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఇదిలాఉండ‌గా, కర్ణాటక సీఎం రేసులో ప్రహ్లాద్‌ జోషి, ముర్గేష్ నిరానీ, బస్వరాజ్‌ బొమ్మై ఉన్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉందన్న ప్ర‌చారం మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

author avatar
sridhar

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju