NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాల‌నే వైఎస్ఆర్‌సీపీ గేమ్ స‌క్సెస్ అవుతుందా?

YSRCP: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కేంద్రంగా సాగిస్తున్న పోరాటంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఓవైపు క‌రోనా, మ‌రోవైపు రైతుల స‌మ‌స్య‌లు పార్ల‌మెంట్‌ను కుదిపేస్తున్న త‌రుణంలో పెగాస‌స్ స్పైవేర్ ఎపిసోడ్ తో ఉభ‌య స‌భ‌లు అట్టుడికిపోతున్నాయి. ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ వేదిక‌గా వైసీపీ ఆందోళ‌న‌లు ఆసక్తిక‌రంగా సాగుతున్నాయి.

Read More: YS Jagan: భ‌రించ‌డం క‌ష్ట‌మే కానీ… జ‌గ‌న్‌ను అభినందించాల్సిందే.

AP CM YS Jagan Comments on false allegations

వైసీపీ ఏం చేస్తోందంటే…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అపేది లేద‌ని, త‌మ‌కున్న 100 శాతం వాటాను విక్ర‌యిస్తామ‌ని ఇప్ప‌టికే కేంద్రం స్ప‌ష్టం చేసింది. రాజ్య‌స‌భ‌లోనే ఆర్ధిక‌శాఖ స‌హాయ‌మంత్రి క‌రాడ్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న త‌రుణంలో విశాఖ స్టీల్ వ్య‌వ‌హారంపై వైసీపీ ఎంపీలు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. దీనిపై స‌భ‌లో వెంట‌నే చ‌ర్చించాల‌ని కోరుతూ రాజ్య‌స‌భ‌లో 267 కింద ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే, మిథున్ రెడ్డి కూడా పోల‌వ‌రంపై కాలింగ్ అటెన్ష‌న్ నోటీసులు ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టు స‌వ‌ర‌ణ అంచ‌నాల అమోదంపై చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని కోరుతూ ఆయ‌న తీర్మానం నోటీసులు ఇచ్చారు.

Read more : Corona: ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.. మ‌ళ్లీ అదే ప‌రిస్థితా?

YS Jagan; Ready to Field Tours bu...

వైసీపీ అజెండా ఆస‌క్తిక‌రం
పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వైసీపీ చేస్తున్న ఆందోళ‌న‌కు కీల‌క అంశాలు ఎంచుకుంది. ప్ర‌త్యేక హోదా, పోల‌వరం నిధులు, దిశాచ‌ట్టం, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని పేర్కొంటూ నోటీసులు అంద‌జేస్తోంది. దీంతో పాటుగా కృష్ణాన‌ది జ‌లాల‌పై వివాదంపైనా స్పందిస్తోంది. లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి అక్ర‌మ‌రీతిలో తెలంగాణ జెన్‌కో విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. శ్రీశైలాం జ‌లాశ‌యంలో నీటి స్థాయి మినీమ‌మ్ 854 ఫీట్లు ఎత్తు ఉండాల‌ని, కానీ 800 ఫీట్ల ఎత్తులో ఉన్న‌ప్పుడు తెలంగాణ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోందని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చినా విద్యుత్తు ఉత్ప‌త్తి జ‌రుగుతోందన్నారు.. దీని వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు నీటి క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు. అన్‌టైమ్‌లీ జ‌న‌రేష‌న్ ఆపాల‌న్నారు. ఏపీ, చెన్నై ప్ర‌జ‌ల సంక్షేమం కోసం విద్యుత్తును ఆపాల‌న్నారు. ఈ ప్ర‌శ్న‌కు జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ ష‌కావ‌త్ బ‌దులిస్తూ.. జెన్‌కోను విద్యుత్తు ఆపాల‌ని కోరామ‌న్నారు. కానీ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోంద‌ని మంత్రి తెలిపారు. మొత్తంగా పార్ల‌మెంటు స‌మావేశాల ద్వారా కేంద్రంను ఇర‌కాటంలో పెట్ట‌డం , ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను వినిపించ‌డం అనే డ‌బుల్ అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోందని అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!