అంత దూరం రాలేను

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోట్ల రూపాయలు టోపీ పెట్టి దేశం విడిచి పారారైన వజ్రాల వ్యాపారి మొహుల్ ఛోక్సీ విచారణకు భారత్ రాలేనని, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించుకోవచ్చునని సెలవిచ్చాడు. దాదాపు 13వేల కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ ప్రస్తతం అంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడ నివసిస్తున్నాడు.

ఈడీ సమన్లు అందుకున్న ఆయన తాను భారత్ కు రావాలంటే…41గంటలు ప్రయాణం చేయాలనీ, అంత ఓపిక తనకు లేదని పేర్కొన్నాడు. తన ఆరోగ్యం బాలేదనీ, భారత్ కు వచ్చి విచారణలో పాల్గొనలేనని పేర్కొన్న చోక్సీ కావాలంటే విడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరౌతానని అందుకు అభ్యంతరం లేదని చెప్పాడు.