ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు అస్వస్థత

ఎంఐఎం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విపరీతమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

చికిత్స అనంతరం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అక్బరుద్దీన్ ఆసుపత్రి పాలయ్యారన్న సమాచారం అందుకున్న ఆయన అభిమానులు, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. గతంలో అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నప్పటి నుంచీ కూడా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఈ విషయాన్ని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అక్బరుద్దీనే స్వయంగా చెప్పారు.

 

SHARE