అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం: క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ అరెస్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో భారత్ కీలక ముందడుగు వేసింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ జాతీయుడు క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ ను భారత్ కు రప్పించింది. అబర్ ఎమిరేట్స్ నుంచి మైకేల్ ను భారత్ కు ‘రా’(రీసెర్చ్ అండ్ అనాలసిస్) కు చెందిన విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే మైకోల్ ను సీబీఐ అదుపులోనికి తీసుకుంది. మరి కొద్ది సేపటిలో మైకేల్ ను కోర్టులో హాజరు పరచనున్నారు.