అడిలైడ్ : టీ విరామ సమయానికి భారత్ స్కోరు 143/6

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభం నుంచే వరుస వికెట్లు కోల్పోతూ పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్ట్రేలియాపై మంచి బ్యాటింగ్  రికార్డ్  ఉన్న స్కిప్పర్ కోహ్లీ కూడా సింగిల్ డిజిట్  కే వెనుదిరగడంతో ఒక దశలో కేవలం 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ను పుజారా కొంత మేరకు ఆదుకున్నాడు. గోడలా నిలబడిపోయి వికెట్ ను కాపాడుకున్నాడు. టీ విరామ సమయానికి పుజారా 46  పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మరో ఎండ్ లో అశ్విన్ 5 పరుగులతో ఆడుతున్నాడు.