అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం

అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు  టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 31 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి సీరీస్ లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై అందని ద్రాక్షగా ఊరిస్తున్న సిరీస్ విజయం లక్ష్యంతో ఉన్న ధోనీ సేనకు ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ తో తడబడి నప్పటికీ ఛటేశ్వర్ పుజారా నిలబడి ఆడి సెంచరీ చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు  చేసింది. భారత్ బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియాను భారత్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకే ఆలౌట్ చేసి కీలకమైన 15 పరుగుల ఆధిక్యత సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో పుజరా, రహానేల హాఫ్ సెంచరీలతో భారత్ 307 పరుగులు సాధించి ఆస్ట్రేలియాకు 323 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఆస్ట్రేలియా విజయానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 291 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా, మహ్మద్ షమీ, అశ్విన్ లు తలో మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.