అడిలైడ్ : పుజారా సెంచరీ

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రదర్శన ఘోరంగా ఉంది. పుజారా మినహా మిగిలిన బ్యాట్స్ మన్ అంతా విఫలమయ్యారు. పుజారా ఒక్కడే భారత్ ఇన్నింగ్స్ పతనాన్ని అడ్డుకుని ఆస్ట్రేలియా బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. 236 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో పుజారా 105 పరుగులతో ఆడుతున్నాడు. మరో ఎండ్ లో షమీ ఉన్నాడు. భారత్ స్కోరు 231/8. ఈ రోజు ఆటలో ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి.