అమరావతి : ఆటోమోబైల్ రంగంలో కీలక ముందడుగు – కియో మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం

కియో  మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగుగా చెప్పవచ్చు. పర్యావరణ రవాణ లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంగా ఏపీ సచివాలయంలో కొద్ది సేపటి కిందట ఈ ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసుకుంది. కియో మోటార్స్ కార్లు పర్యావరణ హితంగా ఉంటాయి. ఈ ఈ వాహనాలను ఒక సారి పూర్తిచా చార్జ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకూ నడుస్తాయి. కియో కార్ల రీచార్జింగ్ కోసం విజయవాడలో రీచార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.