అమృత్ సర్ : సిద్ధూకు క్లీన్ చిట్

96 views

పంజాబ్  మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధూలకు స్థానికి మేజిస్ట్రేల్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అమృత్ సర్ లో రావణదహనం కార్యక్రమం సందర్భంగా రైలు పట్టాలపై పెద్ద ఎత్తున గుమిగూడిన జనంపై నుంచి రైలు వెళ్లిపోయిన సంఘటనకు సంబంధించి వీరిరువురికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. రావణదహనానికి ముఖ్యఅతిధిగా హాజరైన వ్యక్తికి కార్యక్రమ భద్రతా ఏర్పాట్లతో సంబంధం ఉండదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. నాటి కార్యక్రమానికి సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం జరుగుతుండగానే రైలు పట్టాలపై నిలబడి రావణదహనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జనంపై నుంచి రైలు వెళ్లిన సంఘటనలో 60 మంది మరణించారు.