అమెరికాలో ఆర్థిక సంక్షోభం

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ట్రంప్ విధానాల కారణంగా ఈ ఏడాది అమెరికా ఆర్థిక సంక్షోభం అంచుల వరకూ వెళ్లడం ఇది మూడో సారి.

యూఎస్ ఫెడరల్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం ఇవ్వకపోవడంతో నిధులున్నా పైసా ఖర్చు చేయలేని పరిస్థితిలో అమెరికా విలవిలలాడే పరిస్థితి వచ్చింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించే పరిస్థితి నెలకొంది. నిధుల జారీకి అనుమతి లేకపోవడంతో అమెరికా ఖజానా మరొ కొద్ది గంటలలో మూతపడనుంది. దీంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి దాపురించనుంది. అయితే డెమొక్రట్లు దేశ పురోగతికి అడ్డంగా తయారయ్యారని ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదో మేరకు ట్రంప్ దిగి వస్తే తప్ప నిధుల జారీకి కాంగ్రెస్ అనుమతి లభించే అవకాశాలు లేవు.

SHARE