అమ్మకానికి హాయ్ ల్యాండ్-ధర 600 కోట్లు

అగ్రీగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అగ్రీగోల్డ్ ఆస్తులలో అత్యంత ముఖ్యమైన హాయ్ ల్యాండ్ అమ్మకానికి అంతర్జాతీయ స్థాయిలో బిడ్డర్ లను ఆహ్వానించాలని ఆదేశించింది. అలాగే హాయ్ ల్యాండ్ కనీస ధరను రూ.600 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు ఆ స్థలాన్ని వేలం వేయాలని ఎస్ బీఐని ఆదేశించింది.

ఏపీ కేబినెట్ లో అగ్రీగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం పై ఈ రోజు చర్చ జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రీగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై ముందుకు వచ్చిన జీఎస్ఎల్ గ్రూప్ ఈ రోజు హైకోర్టులో తన ప్రతిపాదన ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంది. ఇందుకు ఆమోదించిన హైకోర్టు ఆ సంస్థ డిపాజిట్ చేసిన పది కోట్ల రూపాయలలో మూడు కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద జమచేసుకుని మిగిలిన సొమ్మును మాత్రమే జీఎస్ఎల్ గ్రూప్కు వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది.