అయోధ్యలో భారీ భద్రత

అయోధ్యలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న ముస్లింలు బ్లాక్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం సంఘ్ పరివార్ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  రామమందిర నిర్మాణం విషయంలో ఇటీవల ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ వంటి సంస్థలు తమ గళాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముంగిట మళ్లీ రామమందిర అంశం ప్రధానంగా తెరమీదకు వచ్చిన నేపథ్యంలో అయోధ్యలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.