అరెస్టుకు నెల రోజులు గడువు కోరిన సజ్జన్ కుమార్

ఢిల్లీ సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ కు కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. శిక్ష అనుభవించేందుకు లొంగిపోవడానికి సజ్జన్ కుమార్ నెల రోజుల గడువు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కాగా ఆయన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ రేపు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై తన స్పందనను ఇంతవరకూ తెలియజేయని సజ్జన్ కుమార్ అరెస్టు కావడానికి నెల రోజుల వ్యవధి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ లోగా కోర్టు తనకు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించే వీలుందని భావిస్తున్నారు. ఇలా ఉండగా ఆయన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.

SHARE