ఆప్ఘన్ లో ఉగ్రదాడి-45 మంది మృతి

ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కనీసం 45 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదులు ముందుగా కారుబాంబు పేల్చారు. ఆ తరువాత కార్యాలయాల సముదాయంపై బాంబుల వర్షం కురిపించారు.

కాగా నలుగురు ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. నాలుగో ఉగ్రవాది కారు బాంబు పేలుడులో మరణించారు. ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ నిర్ణయం తీరువాత జరిగిన తొలి దాడి ఇది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.