ఆర్థరైటిస్‌, వెన్ను, మోకాళ్ల నొప్పులు నుంచి మంచి  ఉపశమనం కోసం ఈ ఒక్క పని చేయండి!!

Share

ప్రతి  రోజు వంటింటిలో  మిరియాలు, అల్లం, జీలకర్ర వంటల్లో ఎక్కువగా వాడుతూనే  ఉంటాం. వీటిలో  మన  ఆరోగ్యానికి కావలిసిన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.  చాలా రోగాలు  తగ్గడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటిలో  ఉండే ఔషధ గుణాలు, మోకాళ్లు, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గేలా చేస్తాయి.  ఈ అల్లం, మిరియాలు, బార్లీ గింజలు, జీలకర్ర తో తయారు చేసిన ప్రత్యేక ఔషదం తాగితే క్రమంగా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గుతాయి.

ముందుగా ఈ  ఔషధం  తయారు చేసుకోవడానికి   మూడు టీస్పూన్ల జీలకర్ర, నాలుగు టేబుల్ స్పూన్లు మిరియాలు,మూడు టీస్పూన్ల బార్లీ, కొద్దిగా అల్లం తీసుకుని, వాటిని కొద్దిసేపు  వేపి , చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్‌‌లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు  వేడిచేసుకోవాలి. నీళ్లు మరుగుతుండగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసి, బాగా కలియ తిప్పుతు  మరగనివ్వాలి. ఆ తర్వాత వడబోసి గోరువెచ్చగా ఉండగానే  తాగితే..వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ నుంచి మంచి  ఉపశమనం ఉంటుంది.

దీన్ని ఉదయం భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా  అల్లం, మిరియాలు, జీలకర్ర, బార్లీ గింజలతో తయారు చేసిన ఈ డ్రింక్ తాగితే మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. వేలవేలకు వేలు ఆసుపత్రులకు ఖర్చు పెడితే  తగ్గడం లేదు ఇంకా వీటితో  ఏమి తగ్గుతుంది అని అనుకుంటున్నారా ?మీరు  ఇప్పటికి  ఎన్నో  ప్రయత్నాలు చేసే  ఉంటారు ..ఇప్పుడు  కొన్ని రోజులు  దీన్ని కూడా వాడిచూడండి. మీకు ఫలితం కనిపిస్తే మీ  వాళ్ళందరికీ  చెప్పి  వాడమని చెప్పండి.


Share

Related posts

కొమరం భీమ్ టీజర్ లో ఆర్ ఆర్ ఆర్ కథ మొత్తం చెప్పేశారా ..ఇదుగో చూడండి ఇవే హైలెట్స్ ..!

GRK

బీజేపీకి భంగపాటు!

Siva Prasad

జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే… అఖిల‌ప్రియ సంచ‌ల‌న నిర్ణ‌యం?

sridhar