ఆర్బీఐ గవర్నర్ అవినీతి పరుడు: స్వామి

ఆర్బీఐ గవర్నర్ అవినీతిపరుడని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.   శక్తికాంత దాస్ అవినీతి పరుడనీ , అటువంటి వ్యక్తిని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని స్వామి చెప్పారు. అయితే శక్తికాంత దాస్ అవినీతికి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. అవినీతి ఆరోపణల కారణంగాన గతంలో ఆయనను ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తొలగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడారు. ఆర్బీఐ గవర్నర్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ మాజీ ప్రొఫెసర్ విద్యానథన్ సరైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన కూడా సంఘ్ పరివార్ మనిషేనని చెప్పారు. అలాగే ఎస్ గురుమూర్తిని ఆర్బీఐ బోర్డులోకి తీసుకురావడం పెద్ద తప్పని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.