ఆసిస్ తో తొలిటెస్ట్- పట్టుబిగించిన భారత్

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. ఆట మూడో రోజు ముగిసే సరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ హీరో ఛటేశ్వర్ పుజారా 40 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. భారత స్కిప్పర్ విరాట్ కోహ్లీ 34 పరుగులకు ఔటయ్యాడు. ఇక వరుస వైఫల్యాలతో జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్న కేఎల్ రాహుల్  రెండో ఇన్నింగ్స్ లో ఫరవాలేదనిపించాడు. 44 పరుగుల చేసి హాఫ్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఒక చెత్త షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యారు. మురళీ విజయ్ మళ్లీ విఫలమయ్యాడు. భారత్ ఆధిక్యత ఇప్పటికే 156 పరుగులు ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి. రేపటి మ్యాచ్ లో బ్యాట్స్ మన్ నిలదొక్కుకుని భారీ స్కోరు చేస్తే టెస్ట్ భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి.