ఆస్ట్రేలియా 235 ఆలౌట్

అడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్  లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 191/7 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ టీఎమ్ హెడ్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 72 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో  అశ్విన్, బుమ్రా లు మూడేసి వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.