ఇదేం భాష బాబోయ్ : వెంకయ్యనాయుడు

రాజకీయ నాయకులు వాడుతున్న భాష పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారే తప్ప శత్రువులు కాదని ఆయన అన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సంచార వైద్య శాల ప్రారంభోత్సవానికి ఆయన ఈ ఉదయం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంచార వైద్య శాలను ప్రారంభించిన అనంతరం ఎన్నికల ప్రచారం సందర్భంగానూ, ప్రత్యర్థి పార్టీలు, నేతలపై విమర్శల సందర్భంగానూ రాజకీయ నాయకులు వాడుతున్న భాష సవ్యంగా లేదని ఆయన అన్నారు. రాజకీయ నేతలు హుందాగా వ్యవహరించాలనీ, హుందాగా మాట్లాడాలని హితవు పలికారు.