ఇమ్రాన్ కు అసదుద్దీన్ కౌంటర్

మైనారిటీలను చూసుకునే విషయంలో భారత్ తమ నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ లో అన్ని వర్గాల నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దేశంలో మైనారిటీల పట్ల వివక్ష ఉందన్న నటుడు నసీరుద్దీన్ షా ఇమ్రాన్  వ్యాఖ్యలను ఖండించారు. మా సంగతి మేం చూసుకుంటాం..మీ దేశం సంగతి ముందు మీరు చూసుకోండని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇమ్రాన్ ఖాన్ కు కౌంటర్ ఇచ్చారు.

మైనారిటీల హక్కుల విషయంలో భారత్ నుంచి పాకిస్థాన్ ఎంతో నేర్చోకోవాల్సి ఉందని అన్నారు. భారత్ లో అణగారిన వర్గాలకు కూడా రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టేందుకు ఆస్కారం ఉందని పేర్కొన్న అసదుద్దీన్ పాకిస్థాన్ లో ముస్లిమేతరులు అధ్యక్ష పదవి చేపట్టగలరా? అని నిలదీశారు. మైనారిటీలకు కూడా సమాన హక్కులు భారత్ లో ఉన్నాయని, ఆ సంగతి తాము ప్రదానికి అర్ధం అయ్యేలా చెబుతామని చెప్పారు. పాక్ లో మైనారిటీలకు సమానహక్కులు కల్పించే విషయంలో ముందు మీరు భారత్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని అసదుద్దీన్ పేర్కొన్నారు.