ఇస్రో మరో ప్రయోగానికి రెడీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి రెడీ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 4-10 గంటలకు జీశాట్ 7 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపేందుకు సర్వం సిద్ధమైంది.

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-11 రాకుట్ ద్వారా జీశాట్-7 ఉపగ్రహం నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగరనుంది. ఈ ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ నిన్న మధ్యాహ్నమే మొదలైంది. జీశాట్-7 శాటిలైట్ 2250 కిలోల బరువు. ప్రయోగించిన 18 నిముషాలకు ఇది కక్ష్యలోనికి ప్రవేశిస్తుంది.

వరుస విజయాలతో భారత కీర్తిపతాకను అంతరిక్షంలో రెపరెపలాడిస్తున్న ఇస్రో ఖాతాలోకి జీశాట్-7 ప్రయోగం మరో సక్సెన్ ను చేర్చనుంది.