ఈడీ ఎదుట చిదంబరం

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ను ఈడీ ప్రశ్నిస్తున్నది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరం, కార్తి చిదంబరంలను ఈ నెల 15వ తేదీవరకూ అరెస్టు చేయకుండా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలను వీరు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. సొంత మీడియాకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర మంత్రి హోదాలో చిదంబరం అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులు సంబంధించి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం కూడా దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇలా ఉండగా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చిందంబం అంటున్నారు.