ఈ ఎలుకలకు మందు మహా పసందు!

మనుషులు మద్యం ప్రియులు అంటే నమ్మగలం…కానీ ఎలుకలు మద్యం తాగేశాయంటే నమ్మగలమా! కానీ నమ్మి తీరాలంటున్నారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు.  తమ పోలీసు స్టేషన్ స్టోర్ రూంలో భద్రపరిచిన దాదాపు వెయ్యి లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయి…అవును ఎలుకలే తాగేశాయని నమ్మబలుకుతున్నారు. ఇంతకీ విషయమేమిటంటే…ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని స్టేషన్ లోని స్టోర్ రూంలో భద్రపరిచారు.

ఆ మద్యాన్నే ఎలుకలు మహ చక్కగా తాగేశాయి. మరి ఆ మద్యం తాగి మనుషుల్లాగే అవీ మత్తులో తూగుతూ అల్లరిఅల్లరి చేశాయా అంటే పోలీసులకు ఆ సంగతి తెలియదంట. కానీ ఎలుకలే మొత్తం వెయ్యి లీటర్ల మద్యాన్నీ తాగేశాయని నమ్మబలుకుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు. దీనిపై విచారణకు ఆదేశించారు.