ఉందిలే మంచి ముహూర్తం .!

Share

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ముహూర్తాలను బలంగా నమ్మే కేసీఆర్ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంచి మూహుర్తం కోసం పండితులతో చర్చిస్తున్నారు. ఒక వైపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, మంత్రివర్గ కూర్పు వంటి విషయాలపై పార్టీ ముఖ్యులతో ఎడతెరిపి లేని చర్చలు సాగిస్తూనే…తన ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం మంచి మూహుర్తం కోసం పండితులతో చర్చిస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు కేసీఆర్ రేపు లేదా ఎల్లుడి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు గురువారం సుబ్రహ్మణ్య షట్టి మంచి రోజు…ఉదయం పదకొండు గంటల లోగా మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్పినట్లు తెలుస్తున్నది. అలాగే ఎల్లుండి శుక్రవారం సప్తమి కావడంతో ఆ రోజు కూడా చాలా మంచిరోజు ఆ రోజున కూడా మంచి ముహూర్తం ఉందంటున్నారు. దీంతో కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Share

Related posts

కొందరు సంపన్నులు కుళ్లిన బంగాళాదుంపలు

Siva Prasad

‘అంచనాలు పెంచి దోచుకున్నారు’

somaraju sharma

Ys Jagan: ఏపీలో కరోనా డెత్ డేట్ విషయంలో సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!! 

sekhar

Leave a Comment