ఉదయ్ పూర్ లేక్ పిచోలాలో ఈశా పెళ్లి!

రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలకు ఉదయ్ పూర్ లోని లేక్ పిచోలా సిద్ధమవుతోంది. ప్రకృతి అందాలకు లేక్ పిచాలో ప్యాలెస్ పెట్టింది పేరు. ఆహ్లాద కరమైన వాతావరణంలో ఈశా-ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం డిసెంబర్‌ 12న నిర్వహించనున్నారు. పెళ్లికి ముందు జరిగే ‘సంగీత్‌’, ‘మెహెందీ’ కార్యక్రమాలు డిసెంబర్ 9,10 తేదీల్లో ఈ ప్యాలెస్ లోనే జరగనున్నాయి. అయితే ఈ వేడుకలను అత్యంత ఘనంగానిర్వహించే బాధ్యతను ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ కంపెనీకి అప్పగించారు.