ఎంపీలో వందేమాతరం గీతం వివాదం

జాతీయ గీతం ఆలపించే విషయంలో మధ్యప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య చిచ్చు రేగింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న గత పదిహేనేళ్లుగా ప్రతి నెలా మొదటి తారీకున సచివాలయంలో జాతీయ గీతాలాపన జరుగుతోంది.  అయితే ఆ సంప్రదాయానికి కొత్తగా అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టింది. జాతీయ గీతాన్ని ఆలపించకపోతే దేశ భక్తులు కారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కొనసాగించకుంటే…తాము సచివాలయ ఆవరణలో వందేమాతర గీతం ఆలపిస్తామని విపక్ష బీజేపీ ప్రకటించింది. వందేమాతర గీతం ఆలపించే విషయంలో మధ్య ప్రదేశ్ లో అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు తెరతీసింది. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న పదిహేనేళ్లూ…మధ్య ప్రదేశ్ సచివాలయంలో ప్రతి నెలా మొదటి తారీకున జాతీయగీతం ఆలపించడం ఒక అనవాయితీ ఉండింది. అయితే ఈ సారి ప్రభుత్వం మారింది. ఆనవాయితీ కూడా మారింది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన కాంగ్రెస్ మధ్య ప్రదేశ్ లో అధికారంలోనికి వచ్చింది. జనవరి 1వ తేదీన సచివాలయంలో వందేమాతర గీతాలాపన జరగలేదు. దీంతో విపక్ష బీజేపీ ఫైర్ అయ్యింది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి తేదీన సచివాలయంలో జాతీయ గీతాలాపన జరపాలన్న గత ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేసినట్లు చెప్పారు.జాతీయ గీతాలాపన చేయని వారు దేశభక్తులు కారా అని ప్రశ్నించారు.

కాగా మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రతి నెలా మొదటి తారీకున సచివాలయంలో జాతీయ గీతం ఆలపించాలన్న ఆదేశాన్ని నిలిపివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గీతాలాపన దేశ భక్తిని పెంపొందిస్తుందని, అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేయడం దురద్రుష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనీ, లేకుంటే తానే దేశ భక్తులతో కలిసి సచివాలయ ఆవరణలో వందేమాతర గీతం ఆలపిస్తానని పేర్కొన్నారు. ఈ నెల 6న సచివాలయ ఆవరణలో తాను వందేమాతర గీతం ఆలపిస్తానని చౌహాన్ పేర్కొన్నారు.