ఎంపీ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం 17న

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కమల్ నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది.

15 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎంగా జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.