ఎంపీ సీఎంగా కమల్ నాథ్

89 views

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లి సమరంలో  అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. 230 స్థానాలున్న శాసనసభలో హస్తం పార్టీ 114 చోట్ల విజయం సాధిం మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క స్థానం దూరంలో నిలిచింది. మరో వైపు గట్టిగా పోటీ ఇచ్చిన బీజేపీ 109 సీట్లకే పరిమితం అయింది. ఐదురుగు ఇండిపెండెంట్లు, ఒక బీఎస్పీ, ఒక ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే వారంతా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే సీఎల్పీ నేత విషయంలో కొంత పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం జోక్యంతో అది కూడా సాఫీగా సాగిపోయింది.  నిన్న  సాయంత్రం కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో కమల్ నాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.   కమల్ నాథ్ ను సీఎల్పీ నాయకుడిగా జ్యోతిరాదిత్య సింథియా ప్రతిపాదించగా సభ్యులు ఆమోదం తెలిపారు.