ఎంపీ సీఎంపై కేసు

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై కేసు నమోదైంది. సీఎంప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులలోనే కమల్ నాథ్ పై ముజఫర్ పూర్ కోర్టులో కేసు నమోదు అయ్యింది,  వలసదారులపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ హష్మి అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. స్థానికులకు ఉద్యోగాలు లభ్యం కావడం లేదనీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కవ ఉద్యోగాలలో ఉన్నారని కమల్ నాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మధ్య ప్రదేశ్ లో స్థానికులకే ముందుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కమల్ నాథ్ పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగాలు దక్కించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాలని, స్థానికులకే ముందుగా ఉద్యోగావకాశాలు దక్కాలని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కూడా కమల్ నాథ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో కమల్ నాథ్ పై కూడా విచారణ జరపాలని నాటి అల్లర్ల బాధితుల్లో కొందరు గళమెత్తుతున్నారు. ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు నిన్న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.