ఎన్డీయేకు మరో మిత్రపక్షం దూరం!

ఎన్డీయే బీటలు వారుతున్నదా అన్న అనుమానాలు కలిగేలా కూటమికి ఒక్కో పార్టీ దూరమౌతున్నాయి. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత తన నిర్ణయం ఈ రోజు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు బీజేపీకి విశ్వాసపాత్ర మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ కూడా ఎన్డీయేకు దూరం జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు, మాజీ  ముఖ్యమంత్రి జోరాంధంగ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో 50 ఏళ్ల పాటు బీజేపీదే అధికారం అంటే అమిత్ షా చేసిన ప్రకటనను ఖండించారు. రాజకీయ జోస్యం చెప్పడానికి ఆయనేమైనా దేవుడా అంటూ నిలదీశారు.మిజోరంలో బీజేపీతో కలిసి పని చేయడం తమకు సాధ్యం కాదని కుండబద్దలు కొట్టారు. హిందుత్వ రాజకీయాలకు మిజో నేషనల్ ఫ్రంట్ వ్యతిరేకమని స్పష్టం చేశారు.