ఎన్డీయేకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గుడ్ బై?

ఎన్డీయే నుంచి మరో మిత్ర పక్షం వైదొలగనుందా? అంటే అవుననే భావించాల్సి వస్తున్నది. ఇప్పటికే బీజేపీ వైఖరి పట్ల, ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారశైలి పట్ల పలుమార్లు బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చివరకు ఎన్డీయే నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నది. కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు చెప్పాయి. మొత్తానికి ఈ సాయంత్రంలోగా ఈ మేరకు ఒక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.