ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకా సరిచేస్తాం!

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు ఫిర్యాదులనన్నిటినీ పరిష్కరిస్తామని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుంటామనీ, ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేస్తామనీ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల అయితే ఏకంగా వేల ఓట్లు గల్లంతయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. అలాగే కొన్ని పేర్లు జాబితాలో మూడు నాలుగు సార్లు వచ్చాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులు ఆరోపణల నేపథయంలో ఈసీ స్పందించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఇంటింటికీ తిరిగి ఓట్లు నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామనీ, అలాగే ఓటర్ల జాబితా సరి చేస్తామన్నారు. తెలంగాణ మొత్తంలో ఎక్కువ ఫిర్యాదులు హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం.

SHARE