ఏపీలో సిలికాన్ సిటీ నిర్మాణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలికాన్  సిటీని  నిర్మిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు  అన్నారు. తిరుపతిలో  టీసీఎల్ కంపెనీకి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. టీసీఎల్ ద్వారా ఏడాదికి ఆరులక్షల టీవీలు తయారౌతాయని చెప్పారు. దీని ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఏపీ  త్వరలోనే హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్  హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్  నిర్మించానని, ఇప్పుడు నవ్యాంధ్రలో సిలికాన్ సిటీ నిర్మిస్తానని  చెప్పారు. నెల్లూరు-తిరుపతి-చెన్నై పారిశ్రామిక కారిడాన్  కు  సిలికాన్  సిటీ  అని నామకరణం  చేయనున్నట్లు ప్రకటించిన  ఆయన ప్రపంచంలోనే గొప్ప పారిశ్రామికనగరమైన షెంజెన్ సిటీకి  దీటుగా, చిత్తూరు  జిల్లాలో అటువంటి పారిశ్రామి  పురోగతి సాధిస్తామని, ఈ  ప్రాంతానికి  రూ.22వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు  చెప్పారు.