ఏపీ కేబినెట్ భేటీ నేడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ రోజు జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా పెథాయ్ తుపానుతో వాటిల్లిన నష్టం, రైతులకు సహాయం, పరిహారం చెల్లించే అంశాలపై చర్చించి కేబినెట్ భేటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది.అగ్రీగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు, పోలవరం ప్రాజెక్టు, హైకోర్టు ప్రారంభం తదితర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు.

ఇక కడపలో ఉక్కుకర్మాగారాని శంకుస్థాపన, తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై 9 శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ చర్చిస్తుంది.

 

SHARE