ఏపీ కేబినెట్ సమావేశం నేడు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అద్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెథాయ్ తుపాను నష్టం, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే అగ్రీగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా తీసుకోవలసిన చర్యలపై కూడా కెబినెట్ సమావేశం చర్చిస్తుంది.

ఇక ఏపీఐఐసి ద్వారా పలు సంస్థలకు భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది. జల వనరుల కార్పొరేషన్ నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకునే విషయంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహం, ఇంకా పలు అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది.