ఐదు రాష్ట్రాల తీర్పు నేడే

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్టుగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది సేపటిలో వెలువడనున్నాయి. మధ్యాహ్నానికి ఏ రాష్ట్రంలో సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తేలిపోతుంది. ఫలితాలపై ఎవరెన్ని సర్వేలు నిర్వహించినా ఓటర్ తన నిర్ణయాన్ని నిక్షిప్తం చేసిన ఈవీఎంలో ఓట్లను లెక్కించిన తరువాతే వాస్తవ ఫలితం తేలుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి జాతీయ స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించాయి. ఈ ఎన్నికల ఫలితంపైనే జాతీయ స్థాయి రాజకీయాలలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ లో మొగ్గు కాంగ్రెస్ వైపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో పోరు హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ లు నువ్వానేనా అన్నట్లుగా సాగాయి. ఈ ఫలితాలు రాహుల్ నాయకత్వ పటిమకు, ఆయనకు ప్రజామోదం ఉందా అన్న విషయాన్నీ తేల్చేస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలను బట్టే రాజీవ్ గాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ వెనుక బీజేపీయేతర పార్టీలు నడుస్తాయా లేదా అన్నది తేలిపోతుంది.
SHARE