ఓటింగ్ పట్ల హైదరాబాదీల నిరాసక్తి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ…హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రం పోలింగ్ స్వల్పంగా జరిగింది. హైదరాబాద్ లో 40శాతం, రంగారెడ్డిలో 50శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఇలా ఉండగా ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రజాకూటమి, తెరాసలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కొద్ది సేపటిలో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. వాస్తవ ఫలితం ఏమిటన్నది తేలేదీ 11వ తేదీనే అయినా…తెలంగాణలో అధికారం చేపట్టేది ఎవరన్న అంచనాకు రావడానికి ఎగ్జిట్ పోల్స్ ఏదో మేరకు దోహదపడతాయని భావిస్తున్నారు. గత మూడు రోజులుగా అంచనా ఫలితాలు అంటూ వివిధ సంస్థలు ప్రకటించినప్పటికీ పోలింగ్ తరువాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం పార్టీలు, అభ్యర్థులే కాకుండా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.