ఓటు వేసిన సినీ ప్రముఖులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రాలలో సినీ ప్రముఖులు సకుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో చరంజీవి, నటుడు పోసాని కృష్ణమురళి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అలాగే మోగా స్టార్ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. మరి కొద్ది సేపటి తరువాత రామ్ చరణ్ కూడా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంటాడని చిరంజీవి చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయనీ సందర్భంగా అన్నారు. కాగా తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తార్నాకాలోని పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కు వినియోగించుకోగా, వరంగల్ లో కొండా సురేఖ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు అభ్యర్థులు కూడా తమతమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో తెరాస నాయకుడు హరీష్ రావు ఉదయమే ఓటు వేశారు.