ఓటేసిన తెరాస అధినేత కేసీఆర్

తెరాస అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమకడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా చింతమడక వచ్చిన కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకోగా, ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం పోతంగల్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేటీఆర్, ఆయన సతీమణి కూడా హైదరాబాద్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ఆపద్ధర్మ మంత్రలుు, పార్టీ అభ్యర్థులు కూడా వారి వారి ఓట్లు వేశారు.