కర్నాటక కేబినెట్ విస్తరణ- అసమ్మతికి బీజం

కర్నాటక లో మళ్లీ రాజకీయ సంక్షోభం రానుందా?  మంత్రివర్గ విస్తరణ కుమార స్వామి సర్కార్ కు గండంగా మారనుందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నది.  ఆ రాష్ట్ర మంత్రి, ప్రజ్ణా మంత జనతాపార్టీ ఎమ్మెల్యే అయిన   ఆర్.శంకర్ ప్ర  సరిగ్గా కర్నాటక మంత్రివర్గ విస్తరణ రోజునే   తన అసంతృప్తిని బహిర్గతం చేశారు.

ఈ రోజు జరగబోయే కేబినెట్ విస్తరణలో తనను కేబినెట్ నుంచి తప్పించాలన్న ప్రయత్నం జరుగుతోందని చెప్పిన శంకర్..అదే జరిగితే తాను   బీజేపీ పంచన చేరడం ఖాయమని చెప్పారు. తానింకా బీజేపీతో మాట్లాడలేదనీ, కానీ కేబినెట్ లో స్థానం లేకుండా చేస్తే మాత్రం కచ్చితంగా బీజేపీ గూటికి చేరుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ తనను కేబినెట్ నుంచి తప్పించాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. సీఎల్పీ భేటీకి తనను పిలవకపోవడంతో తనకు ఉద్వాసన పలుకుతారన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.  అసెంబ్లీలో కాంగ్రెస్ అసోసియేుట్  సభ్యుడిగా ఉండేందుకు నిరాకరించిన శంకర్ ను కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

SHARE