కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన పెథాయ్

పెధాయ్ పెను తుపాన్  తీరాన్ని దాటింది.  తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన వద్ద తీరాన్ని తాకింది. తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి తీర ప్రాంతాలన్నీ అతలాకుతలమైపోయాయి. తుపాను తీరాన్ని తాకిన సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. పెనుగాలుల తీవ్రతకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.   గాలులు, వర్ష బీభత్సంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లల్లోకి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.