కాశ్మీర్ లో హింస-ఏడుగురు మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఈ హింసాకాండలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మృత్యు వాత పడ్డారు.

ఈ ఎన్ కౌంటర్ జరిగిన కొద్ది సేపటికే జిల్లాలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. వేర్పాటు వాదులు రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా హింసాకాండకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఆందోళనకారులను నిలువరించడానికి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు.  ఎన్ కౌంటర్, తదననంతర హింసాకాండ నేపథ్యంలో జిల్లాలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి.