కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

94 views
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సెన్సెక్స్ 660 పాయింట్ల నష్టాలలో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 160 పాయింట్లకు పైగా నష్టపోయింది. తెలంగాణ మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ వెనుకబడనున్నదన్న అంచనాల నేపథ్యంలో నెగటివ్ సెంటిమెంట్ తో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.