కొడంగల్ లో కాంగ్రెస్- టీఆర్ఎస్ వర్గాల ఘర్షణ

కొడంగల్ నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది సేపటి కిందట కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోస్గి మండలం నాగులపల్లి  గ్రామంలో ఈ ఘటన జరిగింది. అంతకు ముందు కోస్గిలో కూడా ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరగ్గా పోలీసులు రెండు వర్గాల వారినీ చెదరగొట్టారు.పోలింగ్ స్లిప్పుల విషయంలో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఘర్షణ సమాచారం తెలియగానే కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి సోదరుడు గ్రామానికి చేరుకున్నారు. అంతకు కొద్ది సేపటి ముందే పట్నం నరేందర్ రెడ్డి కూడా గ్రామానికి వచ్చి వెళ్లారు.  కాగా కొడంగల్ లో మధ్యాహ్నం 12 గంటల వరకూ 40శాతం పోలింగ్ జరిగింది.