23 మందితో కొలువైన గెహ్లాట్ కేబినెట్

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  తమ కేబినెట్ ను విస్తరించారు.  23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 23 మందిలో 13 మంది కేబినెట్‌ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులు. రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా గెహ్లాట్, ఉపముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా సీఎం పదవికోసం అశోక్ గెహ్లాట్ లో సచిన్ పైలట్ పోటీ పడిన నేపథ్యంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఇరువురి మధ్యా రాజీ కుదిర్చడంతో సచిన్ పైలట్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.