కోహ్లీ ఔట్-భారత్ స్కోరు 252/7

పెర్త్ టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 7 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. 123 పరుగులు చేసిన కోహ్లీ కమ్మిన్స్ బౌలింగ్ లో హాండ్సకాంబ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే మహ్మద్ షమీ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ లంచ్ విరామ సమయానికి 7 వికెట్లు నష్టపోయి 252 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది. పంత్ 14 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.