కోహ్లీ హాఫ్ సెంచరీ-పుజార ఔట్

పెర్త్ టెస్ట్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కిప్పర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో టీ విరామ సమయం తరువాత స్టార్క్ బౌలింగ్ లో పుజారా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పుజారా 24 పరుగులు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే కోహ్లీ 50 పరుగుల మైలు రాయిని అందుకున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్ అయిన తరువాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ ను ఓపెనర్లు నిరాశ పరిచారు. మురళీ విజయ్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ రెండు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ దశలో జతకలిసిన ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలు సమయోచితంగా ఆడుతూ…మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ శతకం సాధించాడు. మొత్తం 109 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు దీంతో భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు.